Breaking

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జనసేన నాయకుడు మాదాసు మురళి హామీ

ప్రొద్దుటూరు: గోపవరం పంచాయతీలోని 14వ వార్డు శ్రీనివాసపురంలో నెలకొన్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి తెలిపారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఆయన ప్రాంతాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు దరిశ నారాయణ, స్కాలర్స్ బాల సుబ్బారెడ్డి, కందుకూరు భాష తదితరులు మాట్లాడుతూ.. శ్రీనివాసపురంలోని రహదారి సుమారు 20 ఏళ్లుగా అధ్వానంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో స్కాలర్స్ స్కూల్, భాష్యం స్కూల్‌తో పాటు పలు విద్యాసంస్థలు ఉండటంతో ప్రతిరోజూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాకపోకలు సాగిస్తున్నారని, రహదారి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. డ్రైనేజీపై ఉన్న ఆక్రమణలను తొలగించి వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.
దీనిపై మాదాసు మురళి స్పందిస్తూ.. రోడ్డు, డ్రైనేజీ సమస్యలను తొలుత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. అవసరమైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నందిని క్లాత్ మార్కెట్‌లోని జనసేన పార్టీ కార్యాలయాన్ని లేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి తెలియజేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అల్లం చంద్రశేఖర్, రవిశంకర్ రెడ్డి, యువజన నాయకులు వరికూటి నాగార్జున, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.