ప్రొద్దుటూరు: మండలంలోని ఖాదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎస్.వి. ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఐక్యరాజ్యసమితి అంతర్గత పర్యవేక్షణ సేవల కార్యాలయం (OIOS)కు చెందిన కరోలిన్ కురియా, జోసెఫిన్ తదితరుల విదేశీ బృందం పరిశీలించింది.
ప్రొద్దుటూరు మండలంలో మొత్తం 69 పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం 53 పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పాఠశాలలకు అందిస్తున్న భోజనం, మెనూ అమలు, వంటకాల వివరాలు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతపై సిబ్బందిని అడిగి విదేశీ బృందం వివరాలు తెలుసుకుంది.
విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయలను సైతం వినియోగిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ వివిధ రకాల కూరలు, భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు.
కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండలం ఎంఈఓ-2 శోభారాణి, మండల వెలుగు ఏపీఎం రమణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్యామ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.



