ప్రొద్దుటూరు: మహిళను నమ్మించి సుమారు రూ.35 లక్షలు తీసుకోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన బాధితురాలిని బెదిరించిన కేసులో కర్ణాటకకు చెందిన గిరీష్‌రెడ్డి అలియాస్ గిరీష్‌ను ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్‌బళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు తాలూకా హోసూరు గ్రామానికి చెందిన నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో బాధితురాలితో పరిచయం పెంచుకుని డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరింత డబ్బులు ఇవ్వాలని, లేదంటే తప్పుడు వివాహ ధ్రువపత్రాలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు.



