ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 9: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో REDDY.99.APP ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న హుస్సేన్, సురేష్లను ఎస్సై మొయినుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్ బెట్టింగ్, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. బెట్టింగ్ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.



