పులివెందుల: పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. పూలంగళ్ల సర్కిల్ నుంచి సెంట్రల్ బౌలేవార్డ్, వైఎస్సార్ సర్కిల్ వరకు రోడ్డుపై అడ్డంగా వాహనాల పార్కింగ్, దుకాణాల ముందు సామాన్లు ఏర్పాటు చేయడాన్ని పరిశీలించారు.
సీఐలు పురుషోత్తమరాజు, ప్రసాదరావు సిబ్బందితో కలిసి పర్యటించి వాహనదారులు, వ్యాపారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా వాహనాలు నిలపవద్దని, రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Was this article useful?



