సింహాద్రిపురం: గురజాల రోడ్డు సర్కిల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 53 దీపాలను వెలిగించారు. చంద్రబాబు నాయుడు 53 రోజుల నిర్బంధానికి గుర్తుగా పుప్పాల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి లోమడ మురళీయాదవ్‌తో పాటు కూటమి నాయకులు మాట్లాడుతూ న్యాయం, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా దీపాలు వెలిగించామని తెలిపారు. కార్యక్రమంలో పీజీ రాజగోపాల్‌రెడ్డి, పీవై సుదర్శన్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్‌రెడ్డి, రామకృష్ణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, రఫీ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



