ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 9: సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు జాతి చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.ఎస్. ముక్తియార్ అన్నారు. ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల పేరుతో అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేయడం నాటి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాజకీయ కక్షతో ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు తన నీతి, నిజాయితీ, ప్రజాసేవా మార్గాన్ని వీడలేదన్నారు. కష్టకాలంలో చంద్రబాబుకు అండగా రాష్ట్రంలోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా నిలిచారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి నాటి సంఘటనలు నిదర్శనమని ముక్తియార్ పేర్కొన్నారు.
Was this article useful?



