కడప, సెప్టెంబర్ 09: బాలల హక్కుల చట్టాల అమలు, సంక్షేమ పథకాల తీరును పరిశీలించేందుకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత ఈ నెల 10, 11 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కడప, ఖాజీపేట, బద్వేలు, ప్రొద్దుటూరులోని అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, దత్తత సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి, విద్యాసంస్థలు, బాలికల వసతి కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేయడంతో పాటు ప్రొద్దుటూరులో అంగన్వాడీ కార్యకర్తలతో బాలల రక్షణపై సమావేశం నిర్వహించనున్నారు. కమిషన్ సభ్యురాలి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
Was this article useful?



