ప్రొద్దుటూరు: రౌడీషీటర్లు నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో జీవించాలని ప్రొద్దుటూరు రెండో పట్టణ ఎస్ఐ రాఘవేంద్రరెడ్డి సూచించారు. బుధవారం పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లను పిలిపించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని ఎస్ఐ సూచించారు. గొడవలు, దాడులు, బెదిరింపులు, వివాదాల్లో జోక్యం చేసుకోవడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. చెడు స్నేహాలను వదిలి కుటుంబ బాధ్యతలను గుర్తించి ఉపాధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.
యువతను నేరాల వైపు ప్రోత్సహించినా, ఇతరులతో కలిసి నేర కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు



