పులివెందుల, సెప్టెంబర్ 3: అఖిలభారత మానవహక్కుల పరిరక్షణ సంస్థ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ముద్దనూరు రోడ్డులోని దివ్యాంగుల కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ జాతీయ డైరెక్టర్ షేక్ మహబూబ్ పీరా కేక్ కట్ చేసి దివ్యాంగులకు అందించారు. అనంతరం దివ్యాంగులతో పాటు భవిత పాఠశాల విద్యార్థులకు బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ పీరా మాట్లాడుతూ దివ్యాంగుల హక్కులు కూడా మానవ హక్కులేనని, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ కౌన్సిల్ చైర్మన్ మహమ్మద్ అక్రమ్, డా. ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ నాసిర్, భాష, రాజా తదితరులు పాల్గొన్నారు.



