ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 3: ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గురువారం ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణంతో పాటు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాలయాన్ని ఆధునీకరించారు.
ఏఎస్పీ యు.విబు కృష్ణ ఐపీఎస్ చొరవతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు పలువురు దాతలు ఆర్థిక సహకారం అందించారు. ప్రధాన దాత డాక్టర్ వై.వి.స్వరూప్కుమార్రెడ్డితో పాటు సహకరించిన దాతలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.ప్రకాష్‌బాబు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



