పులివెందుల, సెప్టెంబర్ 3: డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల అర్హతలను మరోసారి పరిశీలించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. కడప జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల టెట్, క్రీడా ధ్రువపత్రాలను సమగ్రంగా తనిఖీ చేయాలని కోరారు.
కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో టెట్ అర్హతపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కడప జిల్లాలోనూ అధికారులు విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. అర్హత లేని అభ్యర్థులు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుని, అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని దినేష్ కుమార్ కోరారు.
Was this article useful?



