కడప, సెప్టెంబర్ 3: కడప నగరపాలక సంస్థ డీలిమిటేషన్‌పై కొనసాగుతున్న న్యాయ వివాదానికి హైకోర్టు తీర్పుతో తెరపడింది. డీలిమిటేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
దీంతో కడప నగరపాలక సంస్థ ప్రస్తుత డీలిమిటేషన్ ప్రకారం 66 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులకు మార్గం సుగమమైంది. ఇక ఎన్నికల షెడ్యూల్, ఇతర ప్రక్రియలపై తదుపరి చర్యలు ప్రారంభం కానున్నాయి.
Was this article useful?



