కడప, సెప్టెంబర్ 3: ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో తెల్లటి ప్లాస్టిక్ సంచిలో ఉన్న 9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
విచారణలో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో సతీష్చంద్రపై గతంలోనూ గంజాయి కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరినీ రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Was this article useful?



