రాజంపేట, సెప్టెంబర్ 2: జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బోయినపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రముఖుల విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత బస్టాండ్ నుంచి న్యూ ఆంధ్ర కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జనసేన శ్రేణులు ఉత్సాహం చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ, యువత అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.



