Breaking

పంటల నమోదు చేసుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలు

దువ్వూరు, సెప్టెంబర్ 1: రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మైదుకూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు కృష్ణమూర్తి సూచించారు. మంగళవారం మీర్జాఖాన్‌పల్లె గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
పంట నమోదు చేసుకుంటే పంటల బీమా, పంట నష్టపరిహారం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర వంటి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతు 11 అంకెల విశిష్ట సంఖ్యతో పాటు ఫార్మర్‌ ఐడీ కలిగి ఉండాలని సూచించారు. ఎరువుల పంపిణీలోనూ ఈ వివరాలు అవసరమని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే మినుము, జొన్న, పెసర, కంది వంటి పంటలను ఎంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్‌రెడ్డి రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.