జమ్మలమడుగు: రామిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేష్బాబు ఆధ్వర్యంలో పోలీసులు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సీఐ కోరారు. సైబర్ మోసాలు, దొంగతనాల నివారణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
Was this article useful?



