పులివెందుల: పట్టణంలోని కడప రోడ్, పాలకేంద్రం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చందమామ కేఫ్‌ను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో ఎంపీ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మదన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, మున్సిపల్ యువ నాయకులు చవ్వా దుష్యంత్ రెడ్డి, కదిరి పూల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



