Breaking

మైనర్ డ్రైవింగ్‌పై వన్‌టౌన్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

ప్రొద్దుటూరు: మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు గాంధీరోడ్డులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 15 మంది మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ప్రమాదాలతో పాటు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని, ఇకపై పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు రూ.13,245 జరిమానా విధించారు. మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.