పులివెందుల: కమలాపురం ఆర్యవైశ్య సంఘం నాయకుడు సురేష్కుమార్పై జరిగినట్లు చెబుతున్న దాడి, కిడ్నాప్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పులివెందుల వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో అంగళ్లను కోల్పోతున్న బాధితుల తరఫున నష్టపరిహారం కోసం సురేష్కుమార్ ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఆర్యవైశ్యుల సమస్యలపై తమ పార్టీ అండగా ఉంటుందని వెల్లంపల్లి తెలిపారు.
Was this article useful?



