రాజుపాలెం: మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని మండలంలోని అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంఆర్ఓ హరినాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Was this article useful?



