ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 1: పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. మంగళవారం 6వ వార్డు పరిధిలోని డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో పింఛన్ల పంపిణీని ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
ప్రొద్దుటూరు పట్టణంలో వివిధ వర్గాలకు చెందిన 14,094 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.6.21 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అర్హులైన వారికి ఇంటి వద్దనే పింఛను అందించి, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులైన మహబూబ్, సుబ్బారాయుడులకు పింఛను నగదు అందజేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
Was this article useful?



