పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మైనార్టీ నాయకులు ఆయనను స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మక్కా నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలను అవినాష్ రెడ్డికి అందజేశారు. మైనార్టీ సోదరులు చూపిన ఆత్మీయత, అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షులు రసూల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నూరుల్లా, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



