పులివెందుల: గ్యాస్ ఏజెన్సీ పేరుతో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరిప్రియ గ్యాస్ ఏజెన్సీకి చెందిన వారిగా చెప్పుకుంటూ ‘మాండేటరీ ఇన్స్పెక్షన్’ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.240 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తొమ్మిది నెలల క్రితమే ఇన్స్పెక్షన్ చేయించుకున్న వారి వద్ద కూడా డబ్బులు అడగడంతో వినియోగదారులు వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వసూళ్లకు ఎవరి ఆదేశాలు ఉన్నాయి? నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేశారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Was this article useful?



