జమ్మలమడుగు: రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లో విద్యుత్ టవర్లు నిర్మిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఉప్పలపాడు, గుండ్లకుంట గ్రామాల్లో టవర్ల నిర్మాణాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన పరిహారం పెంచి ఇవ్వాలని, లేకుంటే భూములను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై దౌర్జన్యానికి పాల్పడితే సహించేది లేదని పవర్‌గ్రిడ్ సంస్థను హెచ్చరించారు. అనంతరం రైతులతో కలిసి ఆర్డీవో శిరీషకు వినతిపత్రం అందజేశారు.
Was this article useful?



