ప్రొద్దుటూరు, ఆగస్టు 31: ‘మానవ సేవే మాధవ సేవ’ ఆశయంతో గత ఐదేళ్లుగా శివోహం సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శివోహం అన్నప్రసాద సేవా సంస్థ అధ్యక్షులు శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. హనుమత్ లింగేశ్వర స్వామి ఆలయంలో రాంప్రసాద్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నాభిషేకం, అన్నప్రసాద సేవ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి పి. రామమునిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం గొప్ప సేవ అని, కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద సేవను కొనసాగిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, విష్ణు నారాయణ, కొవ్వూరు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



