ప్రొద్దుటూరు, ఆగస్టు 31: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్యాదవ్పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజగోపాల్‌యాదవ్ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రొద్దుటూరు వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని, పట్టణంలో కార్పొరేట్ మాల్స్ ఏర్పాటుపై రాచమల్లు గత పరిస్థితులను గుర్తు చేసుకోవాలని సూచించారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రవీణ్‌రెడ్డి అన్నారు. బెదిరింపు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.



