రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు రింగురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లోహిత వెజ్ అండ్ నాన్‌వెజ్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్ యజమాని రమేష్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ప్రసాద్‌బాబు నిర్వాహకులను అభినందించారు. వినియోగదారులకు నాణ్యత, రుచి, పరిశుభ్రతతో కూడిన ఆహారాన్ని అందిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆహార రంగంలో పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.



