పులివెందుల: మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని నేత్రసేకరణ కేంద్రం అధ్యక్షులు రాజు తెలిపారు. గీత మందిరంలో మానవతా స్వచ్ఛంద సంస్థ నెలవారీ సమావేశం సందర్భంగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహించాలని రాజు కోరారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు సమష్టిగా కృషి చేస్తే అంధరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మానవత అధ్యక్షులు కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, మైసూరారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, హరిచంద్రారెడ్డి, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



