రాయచోటి: ఎస్వీ విద్యామందిర్ హైస్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మాతృభాషను ప్రేమించి, పరిరక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఇతర భాషలను నేర్చుకున్నా తెలుగును గౌరవించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Was this article useful?



