Breaking

శ్రావణ పౌర్ణమి సందర్భంగా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు

ప్రొద్దుటూరు: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలం నుంచే స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు విశేషంగా గోపూజ అనంతరం గణపతి, నవగ్రహ, ఉపగ్రహ, ఉపదేవతలకు ప్రత్యేక పూజలు చేపట్టారు.
అలాగే ఆయుష్య, మృత్యుంజయ, మన్యు, సుదర్శన, శ్రీ సూక్త, మహాలక్ష్మీ హోమాలను అర్చక స్వాముల బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఆలయ ఈఓ కే.వీ. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.