ప్రొద్దుటూరు: స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివిధ వర్గాల వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పలువురు వ్యాపారస్తులు ఆయన నివాసానికి వెళ్లి రాచమల్లును శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక వ్యాపారులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు, చిరు వ్యాపారులు, వస్త్ర దుకాణాల యజమానులు, నాయి బ్రాహ్మణులు తదితరులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ప్రజలు, వ్యాపారస్తులు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
Was this article useful?



