ప్రొద్దుటూరు: సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ)లో ప్రథమ సంవత్సరం బీటెక్, డిప్లమో, ద్వితీయ సంవత్సరం లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొద్దుటూరు ఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగన్ రవి, కరస్పాండెంట్ వీర కళ్యాణ్‌రెడ్డి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మోటివేషన్ స్పీకర్ బి.ఆర్. షఫీ ప్రేరణాత్మక ప్రసంగంతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



