పులివెందుల: పట్టణ పోలీస్ శాఖలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పట్టణ సీఐగా విధులు నిర్వహించిన శ్రీరామ్‌ను వీఆర్‌కు పంపగా, ఆయన స్థానంలో పురుషోత్తంరాజును నూతన సీఐగా నియమించారు. శుక్రవారం ఉదయం పురుషోత్తంరాజు పులివెందుల పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. బాధ్యతలు చేపట్టిన నూతన సీఐకు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



