పులివెందుల, ఆగస్టు 28: సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్ తనూజ సూచించారు. శుక్రవారం వెలమవారిపల్లె సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికతో పాటు సచివాలయ రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి, స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారికి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



