ప్రొద్దుటూరు, ఆగస్టు 28: స్థానిక వ్యాపారులు బలపడితేనే ప్రాంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన నాయకుడు మాదాసు మురళీ అన్నారు. నందినిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రొద్దుటూరులో ఎన్నో ఏళ్లుగా స్థానిక వ్యాపారులు ప్రజలకు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. కార్పొరేట్ సంస్థల రాకతో చిన్న, చిరు వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల స్థానిక వ్యాపారుల ప్రయోజనాలకు భంగం కలిగించే సంస్థలను జనసేన వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గతంలో కార్పొరేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు స్థానిక వ్యాపారులకు మద్దతు ప్రకటించడం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. వ్యాపారుల సమస్యలను పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వారి ప్రయోజనాల కోసం జనసేన అండగా ఉంటుందని మురళీ తెలిపారు.



