జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జమ్మలమడుగు ఎస్ఐ సత్యనారాయణ గురువారం పొన్నతోట గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై కొత్త క్రిమినల్ చట్టాలు, సైబర్ నేరాల నివారణ, మహిళలు, బాలల భద్రత, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, అనుమానాస్పద మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
Was this article useful?



