పీలేరు, ఏప్రిల్ 16: జంగంపల్లి–కలికిరి రోడ్డుపై చింతపర్తి గ్రామానికి చెందిన జ్ఞానశేఖర్ రెడ్డి (62) స్కూటీపై పీలేరు వైపు వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన అతివేగ కారు ఢీకొట్టింది. ఆయన రోడ్డుపై పడి గాయపడ్డారు. స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పీలేరు ఎస్సై లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post Views: 3