ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతామని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా తెలిపారు. స్వశక్తి భవన్‌లో ఎస్‌టీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనల నుంచి న్యాయం చేయాలని కోరారు. సమస్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటానని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ఇర్ఫాన్ బాషా స్పష్టం చేశారు.



