జమ్మలమడుగు: ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం గొప్ప మానవతా సేవ అని చాటుతూ జమ్మలమడుగులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గూడుమస్తాన్ దర్గా సమీపంలో కర్మలవారిపల్లె సర్పంచ్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ను సంప్రదించగా, ఫుడ్ డొనేషన్ ద్వారా తమ వంతు సహాయంగా ఆకలితో ఉన్న వారికి భోజనం అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. ఒక పూట భోజనం అందించడం ద్వారా ఆకలి తీర్చడంతో పాటు వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావచ్చన్నారు. మన దగ్గర ఉన్నదాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచుకోవడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని తెలిపారు.
అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ప్రేమ, దయ, సేవాభావాన్ని పంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మోరే లక్ష్మణ్ రావు, అహమ్మద్ హుస్సేన్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.



