పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పులివెందుల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణపల్లి రోడ్డు చౌడమ్మ దేవాలయం వద్ద కోడి రమణ, రాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
భాగరాపురంలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలోనూ కేక్ కటింగ్ నిర్వహించి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్మికులు, దివ్యాంగులకు చీరలు అందజేశారు. కార్యక్రమాల్లో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



