సింహాద్రిపురం: మండలంలోని అంకాలమ్మగూడూరు కొత్తపాలెం గ్రామంలో నూతన శ్రీరాముడి దేవాలయ నిర్మాణానికి పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణం సజావుగా పూర్తికావాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ నాయకులు బాబు రెడ్డి, సాంబశివరెడ్డి, సతీష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
Was this article useful?



