యువ కరాటే అభిలాష్‌కు మంత్రి అభినందనలు

తాడేపల్లి,
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కవురు అభిలాష్ తన తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభిలాష్ తన క్రీడా ప్రస్థానం, సాధించిన విజయాలు వివరించి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అభిలాష్ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించినట్లు తెలిపారు. శిక్షణ, పోటీల కోసం భారీగా ఖర్చు అవుతోందని పేర్కొంటూ, తన ప్రతిభను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు, శిక్షణ ఖర్చులకు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అభిలాష్‌ను అభినందించి, అతని ప్రతిభను ప్రశంసించారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని పేర్కొంటూ, సంబంధిత అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Facebook
X
LinkedIn
WhatsApp