ప్రొద్దుటూరు: మిలాదున్ నబీ సందర్భంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో విశ్వశాంతి ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని నాజీరుల్లా ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అసార్ షరీఫ్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. వీఎస్. ముక్తియార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు శాంతి, సోదరభావం, పరస్పర ప్రేమ, గౌరవాన్ని పెంపొందించేలా ఉంటాయని అన్నారు. మత సామరస్యంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంజుమన్ కమిటీ ప్రతినిధులు, మౌలీలు, ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు, యువత పాల్గొన్నారు.
Was this article useful?



