వేముల: కణం కిందకొట్టాల గ్రామ సమీపంలోని యురేనియం టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు టైలింగ్ పాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు పునరావాసం, నష్టపరిహారం కల్పించకుండా పనులు చేపట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. టైలింగ్ పాండ్ ప్రభావంతో గ్రామంలో ఆరోగ్య సమస్యలు, పంట దిగుబడులపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పునరావాసం, నష్టపరిహారం అందించడంతో పాటు పాండ్ ఎత్తు పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.
Was this article useful?



