జమ్మలమడుగు: మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



