బద్వేలు, ఆగస్టు 25: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగేలా స్పెషల్ టెట్ నిబంధనల్లో మార్పులు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం స్పెషల్ టెట్ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా నాయకులు మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులు నిర్ణయించి, ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని కోరారు. గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Was this article useful?



