పులివెందుల, ఆగస్టు 25: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సన్మానించి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రెడ్యం మాట్లాడుతూ వివేకా కేసులో అవినాష్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ తదితర అంశాలపై సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈడీ సోదాల అంశంపై అవినాష్‌రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



