పులివెందుల, ఆగస్టు 25: పులివెందుల శిల్పారామాన్ని మరింత అభివృద్ధి చేసి సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ మంజులారెడ్డి తెలిపారు. మంగళవారం శిల్పారామాన్ని సందర్శించిన ఆమె అక్కడి వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
సందర్శకుల సంఖ్యను పెంచేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం అభివృద్ధిపై కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి మరిన్ని వసతులు కల్పిస్తామని మంజులారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పాల్గొని శిల్పారామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
Was this article useful?



