పులివెందుల: పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో బీజేపీ యువమోర్చా విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది యువకులు పార్టీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని శశిభూషణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



